నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం తప్పదు : డబ్ల్యూహెచ్ఓ



 















  • జెనీవా: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తీవ్రమైన హెచ్చరిక చేసింది. కరోనాపై పోరాటంలో నిర్లక్ష్యం చేస్తే ప్రపంచం సుదీర్ఘమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని డబ్ల్యుహెచ్ఒ డైరెక్టర్ జనరల్  చెప్పారు.  పలు సూచనలు చేసినా పలు దేశాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని టెడ్రోస్ వ్యాఖ్యానించారు.






  • ప్రస్తుతం యూరోప్ దేశాల్లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని జెనీవాలో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో టెడ్రోస్ తెలిపారు. అయితే, ఆఫ్రికాతోపాటు సెంట్రల్, సౌత్ అమెరికా, ఈస్టర్న్ యూరోప్ దేశాల్లో మాత్రం కరోనా మహమ్మారి వ్యాప్తి ఆందోళనకు గురిచేస్తోందన్నారు. పలు దేశాలు ఇప్పుడిప్పుడే కరోనా బారినపడుతున్నాయని, మరికొన్ని దేశాలు కరోనా నుంచి కోలుకుంటున్నాయని తెలిపారు. ఎలాంటి పొరపాటు చేసిన దీర్గ కాలికంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రపంచ దేశాలను టెడ్రోస్ హెచ్చరించారు.  

  • కాగా, ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1,75,000 కరోనా మరణాలు సంభవించాయి. 2.5 మిలియన్ల మంది కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. డబ్ల్యూహెచ్ఓ కరోనా నియంత్రణ విషయంలో తనవంతు పాత్రను పోషించిందని తెలిపారు. జనవరిలోనే గ్లోబల్ ఎమర్జెన్సీ విధించి దేశాలను అప్రమత్తం చేశామని మరోసారి గుర్తు చేశారు. సరైన సమయంలో హెచ్చరికలు చేసినా పలు దేశాలు అప్రమత్తం కాలేదని వ్యాఖ్యానించారు.