లక్ష్యం న్యూస్ : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి మన్ కీ బాత్ లో మాట్లాడారు. కరోనా వైరస్‌పై భారత్‌లో జరుగుతున్నది ప్రజాపోరాటం అని అన్నారు. ప్రజలు, ప్రభుత్వాధికారులు కలిసికట్టుగా వైరస్‌పై పోరాడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక పౌరుడు.. సైనికుడిలా వైరస్‌ఫై యుద్ధం చేస్తున్నారన్నారు. కరోనా సంక్షోభ వేళ రైతులు మాత్రం నిర్విరామంగా పనిచేస్తున్నారన్నారు. ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా ఉండేందుకు రైతులు శ్రమిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ వారి వారి సామర్థ్యానికి తగినట్లు పోరాడుతున్నారన్నారు. కొందరు ఇంటి కిరాయిలను మాఫీ చేస్తున్నారని, క్వారెంటైన్‌లో ఉన్న వాళ్లు స్కూళ్లకు రంగలు అద్దుతున్నారన్నారు. కోవిడ్ వారియర్స్ అనే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేశామని, ఎన్జీవోలు, స్థానిక ప్రభుత్వాలు దాంట్లో భాగమైనట్లు చెప్పారు. డాక్టర్లు, నర్సులు, ఎన్‌సీసీ క్యాడెట్లు కూడా దాంట్లో జతకలిశారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతి శాఖ, సంస్థలు అన్నీ.. వీలైనంత త్వరగా కోలుకునేందుకు కలిసి పనిచేస్తున్నాయన్నారు.
సైనికుల్లా పోరాడుతున్న దేశ పౌరులు : ప్రధాని