గబ్బిలాల్లో కరోనా వైరస్

 






ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మూలాలపై నిరంతర అధ్యయనాలు,పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. వైరస్ గబ్బిలాల ద్వారానే మనుషులకు సోకిందా.. లేక వాటిలో  వృద్ది చెంది మరో జంతువు ద్వారా మనుషులకు వ్యాప్తి చెందిందా అన్న కోణంలో పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ పరిశోధనలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ మనుషులకు గబ్బిలాల ద్వారా నేరుగా వ్యాప్తి చెందడం లేదా వాటి నుంచి అలుగులకు వ్యాప్తి చెంది ఉండొచ్చని పేర్కొంది. వాటి ద్వారా మనుషులకు వ్యాప్తి చెంది ఉండవచ్చునని  తెలిపింది. అయితే గబ్బిలాల ద్వారా వైరస్ వెయ్యేళ్లకు ఒకసారి మాత్రమే సంక్రమించే అవకాశం వుందని తెలిపింది. అయితే ప్రస్తుతం ప్రబలిన కరోనా వైరస్ కు తాము గబ్బిలాల్లో గుర్తించిన వైరస్ కు వ్యత్యాసం వుందని పేర్కొంది.