కోవిడ్-19 నియంత్రణ కు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్ లైన్స్ ను పక్కా గా అమలు జరపాలని సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ ఆదేశించారు.బుధవారం న్యూఢిల్లీ నుండి అన్ని రాష్ట్రాల జిల్లా కలెక్టర్ లు, పోలీస్, మెడికల్, మునిసిపల్ కమీషనర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలను జారీ చేశారు.
ఈ సందర్భంగా కేబినెట్ సెక్రటరీ మాట్లాడుతూ కరోనా వైరస్ అరికట్టే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను మే 3 వ తేదీ వరకూ పొడిగించి నందున అన్ని ప్రాంతాల్లో తప్పని సరిగా పాటించాలన్నారు.
ఏప్రిల్ 20 వ తేదీ వరకు ఎటువంటి సడలింపు లు ఉండవని, కంటై న్మెంట్ జోన్ లలో హాట్ స్పాట్ లను గుర్తించి ఆయా ఏరియా లలో ఇంటింటి సర్వే చేపట్టాలన్నారు. ఆయా ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులకు తప్పించి ఎటువంటి అనుమతులుండవనీ ,లాక్ డౌన్ ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ఏప్రిల్ 20వ తేదీ తర్వాత రెడ్ జోన్ లకు తప్పించి, మిగిలిన ప్రాంతాలలో అక్కడి పరిస్థితులను బట్టి ప్రభుత్వ గైడ్ లైన్ల ప్రకారం ప్రాధాన్యత గలఅంశాలకు సడలింపు ఉంటుందన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీస్ కమిషనర్ అర్ కే మీన, జీ వీ ఎం సీ కమిషనర్ జి సృజన, పాడేరు సబ్ కలక్టర్ వెంకటేశ్వర్, రూరల్ ఎస్ పీ అట్టాడ బాబూజీ తదితరులు హాజరయ్యారు.
నిబంధనలు పాటించాల్సిందే